KGF Trailer Talk: Highly Impressive And Raises Curiosity Manifoldsకన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కేజీఎఫ్” ట్రైలర్ వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హింది భాషలలో డిసెంబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఈ ట్రైలర్ ఉందని చెప్పడంలో ఏ మాత్రం సంకోచం లేదు. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడని కధ కావడంతో అత్యంత ఆసక్తిని రేపుతోంది.

తెరపై స్టన్నింగ్ విజువల్స్… ఫోటోగ్రఫీ… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… హీరో హావభావాలు… ఇలా ప్రతి విభాగంలోనూ అత్యద్భుతమైన ప్రదర్శన కనపడుతోంది. ‘ఉగ్రం’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను తెలుగు వారాహి చలన చిత్ర సంస్థ అందిస్తోంది. ఈ ట్రైలర్ చూసాక మరోసారి రిలీజ్ డేట్ ఎప్పుడా? అని ఆలోచించుకోవడం సినీ అభిమానులకు సహజం.