KGF Chapter 2 bigger than kgf chapter 1కథలో కంటెంట్.. హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు.

ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ అదిరిపోయింది. కేజీఎఫ్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. దాదాపుగా 80% పూర్తి అయ్యిందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాయలసీమలో జరుగుతుంది. నిన్నటిదాకా కర్నూల్ జిల్లాలోని ఒక మైన్ లో ఒక కీలక సీన్ తీశారు. ఈరోజు నుండి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఇంకో సీన్ తీస్తున్నారు.

ఇది కూడా ఒక నేపథ్యంలో తీస్తున్న సీన్ కావడం విశేషం. ఇది ఇలా ఉండగా కేజీఎఫ్ 2 మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.

కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో “ఒకసారి కేజీఎఫ్ 2 తెర మీద చూశాకా కేజీఎఫ్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది,” యష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.