KEY  Telugu Movie Teaser TALKరోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికత కార‌ణంగా వ్య‌క్తిగ‌త జీవితం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంద‌నే క‌థాంశంతో తెర‌కెక్కిన `కీ` చిత్రం తెలుగు టీజ‌ర్ విడుద‌లైంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. `రంగం` ఫేం జీవా ప్ర‌ధాన పాత్రలో న‌టించిన ఈ చిత్రం టీజ‌ర్ చేతిలో ఉన్న మొబైల్ మరియు కంప్యూటర్ కు సంబంధించినది కావడంతో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతోంది.

ఇటీవ‌ల టీనేజీ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన బ్లూవేల్ గేమ్ గురించి ఈ టీజ‌ర్‌లో ప్ర‌స్తావించి వర్తమాన అంశాలను మేళవించారు. టెక్నాల‌జీ అతివాడ‌కం వ‌ల్ల వ‌చ్చే అన‌ర్థాల‌ను ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిక్కీ గ‌ల్రాని క‌థానాయికగా న‌టించిన ఈ చిత్రానికి క‌లీస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `కంట్రోల్‌ ఆల్ట్‌ డై` ఉప‌శీర్షిక‌తో వ‌స్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌లోని డైలాగులు సందర్భోచితంగా ఉన్నాయి.