Keshava-movie-box office collectionsబాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ సునామీ తర్వాత చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహానికి నిఖిల్ “కేశవ” శుభంకార్డు వేసింది. ఎందుకంటే… ‘బాహుబలి 2’ ఇచ్చిన ఊపును ‘కేశవ’ తనకు అనుగుణంగా మలచుకోవడంలో పూర్తిగా విజయవంతం అయ్యాడు. తొలి మూడు రోజుల్లోనే దాదాపుగా 11.40 కోట్లు కొల్లగొట్టి, నిఖిల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టుకున్నాడు. ఇదే ఒరవడి కొనసాగితే, 25-30 కోట్ల నడుమ ‘కేశవ’ ల్యాండ్ కావచ్చన్నది ట్రేడ్ పండితుల అంచనా.

మూడు రోజుల్లోనే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ను మించి వసూలు చేయడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. నిజానికి ‘కేశవ’ యూనిట్ ఆశించిన విధంగా ఫుల్ పాజిటివ్ టాక్ రాకపోతేనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిందంటే… నిఖిల్ మార్కెట్ పెరిగిందనే భావించాలి. కొత్త తరహా కధలను ఎంపిక చేసుకుంటున్నాడనే బలమైన ముద్రను ప్రేక్షకుల మదిలో వేయడంలో నిఖిల్ సక్సెస్ అయ్యాడు. ఆ ప్రభావమే “కేశవ” ఓపెనింగ్స్ రూపంలో ఇలా కనిపించాయి. అయితే ఓవర్సీస్ లో మాత్రం ‘కేశవ’కు ఆశించిన స్పందన రాకపోవడం గమనించదగ్గ విషయం.