Kerala Women opposing supreme court verdict on sabarimalaశబరిమలలో చిన్ముద్రుని రూపంలో కొలువుతీరి ఉన్న అయ్యప్ప స్వామి దర్శనానికి మహిళలకు కూడా అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై ఓవరాల్ గా భిన్న స్పందనలు వ్యక్తమవుతుండడం విశేషం. సుప్రీం వెలువరించిన రోజున పలువురు సెలబ్రిటీలు ఈ తీర్పుపై హర్షాతిరేకం వ్యక్తం చేసారు.

కానీ ఏనాటి నుండో అమలవుతున్న సంప్రదాయాన్నే శబరిమలకు వర్తింపచేయాలని కోరుతూ కేరళలోని మహిళాలోకం నిరసనలు తెలియజేసారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా రహదారులను దిగ్భంధనం చేసారు. హిందువులంతా తమకు మద్దతుగా నిలవాలని, ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.

శబరిమలలోకి మహిళలకు ఎంట్రీ వస్తే అడుగుపెట్టడానికి ప్రముఖులంతా సిద్ధంగా ఉన్న నేపధ్యంలో… సామాన్య లోకం మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉండడం, బహుశా అయ్యప్పపై ఉన్న నమ్మకమనే చెప్పాలి. దీంతో ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ నుండి మొదలు కాబోయే శబరిమల యాత్ర ఎలా కొనసాగుతుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.