Keerthy Suresh greets Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనిరుధ్ మ్యూజికల్ వీడియోలో లాస్ట్ షాట్… పవన్ కళ్యాణ్ చైర్ తిప్పే సన్నివేశం ఫ్యాన్స్ ను ఎంత బాగా ఆకట్టుకుందో, లాస్ట్ మినిట్ లో హీరోయిన్ కీర్తి సురేష్ పోస్ట్ చేసిన ఓ ఫోటో కూడా అంతే స్థాయిలో అభిమానులను ఆకర్షించింది. డైరీలో ఏదో రాసుకుంటూ చిరుదరహాసం ప్రదర్శిస్తోన్న కీర్తి సురేష్ ను ఓరగా చూస్తూ పవన్ కళ్యాణ్ కూడా తన మార్క్ నవ్వును ప్రదర్శిస్తున్నారు.

మాంచి కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫోటోలో కీర్తి లుక్ అదిరిపోయే విధంగా ఉండడంతో, సినిమాకున్న ప్రధాన హైలైట్స్ లో కీర్తి పేరు కూడా చేరిపోయినట్లే! ఈ ఫోటోలో కీర్తి ఎంత బాగుందో, పవర్ స్టార్ కూడా అదే స్థాయిలో వీక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ నవ్వే స్టైల్ ఫ్యాన్స్ కు పుట్టినరోజు ఫైనల్ కిక్ ను పంచిందని చెప్పవచ్చు. మరి ఈ ఇద్దరి నవ్వులలో ఎవరిది బాగుంది అన్న పోల్ పెడితే… సందర్శకులు ఎవరికీ ఓటేస్తారో..!