Keerthy Suresh at Hyderabad Airportయంగ్ హీరో నితిన్ రంగ్ దే షూటింగ్ కొన్ని రోజుల ముందు హైదరాబాద్ మొదలయ్యింది. కరోనా కారణంగా ఆరు నెలల పాటు ఆగిపోయిన షూట్ అన్ని రకాల సేఫ్టీ నియమాల మధ్య మొదలయ్యింది. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనడం కోసం మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హైదరాబాద్ వచ్చింది. నితిన్, కీర్తి కాంబినేషన్లో సీన్స్, బ్యాలన్స్ సాంగ్స్ షూట్ చేస్తారు.

చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటలచిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. ప్రస్తుతానికి ఓటీటీ.. థియేటర్ రిలీజ్ రెండు ఆప్షన్లు ఓపెన్ గా పెట్టుకుంది చిత్రబృందం. ఎటువైపు మొగ్గు చూపుతారు అనేదాని మీద ఒక నెల రోజులలో క్లారిటీ రావొచ్చు.

లాక్ డౌన్ తో ఇండస్ట్రీ మూతపడే కొంచెం ముందు.. నితిన్ భీష్మతో టాలీవుడ్ కు చివరి హిట్ ఇచ్చాడు. లాక్ డౌన్ లో అతను ఒక ఇంటి వాడు కూడా అయ్యాడు. ఈ క్రమంలో మరో హిట్ కొట్టాలని బాగా ఆసక్తిగా ఉన్నాడు. డైరెక్టు ఆన్ లైన్ రిలీజ్ అంటే అతనికి కొంత మేర నిరాశే అని చెప్పుకోవాలి.

సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే విడుదలైన చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.