keeravani-says-rajamouli-likes-children-moviesఈ వారం మొదట్లో ఎస్ఎస్ రాజమౌళి ఆస్కార్ విన్నరైన పేరసైట్ చిత్రం చూస్తూ తాను మధ్యలోనే నిద్రపోయానని వెల్లడించాడు. ఇప్పుడు, రాజమౌళి సోదరుడు కీరవాణి రాజమౌళి సినిమాలు చూసే విధానం గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “రాజమౌళిలో నాకు నచ్చని ఏకైక గుణం పిల్లల సినిమాలు చూడటం అతని అలవాటు” అని ఆయన వెల్లడించారు.

అయితే కొందరు మాత్రం రాజమౌళిని ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడిగా మార్చడానికి కారణం అదే కావచ్చు. బహుశా అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన సినిమాలను ఇష్టపడతారెమో. అతని సినిమాలు ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టాయి.

కీరవాణి ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ కు సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి అన్ని సినిమాలకు కీరవాణే సంగీతం సమకూరుస్తారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో రాజమౌళి, కీరవాణి ఆర్ఆర్ఆర్ సంగీత చర్చలలో బిజీగా ఉన్నారు. సాంగ్స్ ఇప్పటికే ఫైనల్ కాగా, ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉండగా… ఆర్ఆర్ఆర్ ను సంక్రాంతి సందర్భంగా జనవరి 8, 2021న విడుదల చెయ్యాలని భావించారు. అయితే ఈ లాక్ డౌన్ బ్రేక్ వల్ల సినిమా వేసవికి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా మెగా, నందమూరి హీరోలు కలిసి నటించనున్న సంగతి తెలిసిందే.

కొందరు మాత్రం రాజమౌళిని ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడిగా మార్చడానికి కారణం అదే కావచ్చు అంటున్నారు