Kedarnath movie in controversy-బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ తనయురాలు సారా అలీఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతూ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన నటించిన “కేదార్ నాథ్” సినిమా చుట్టూ ప్రస్తుతం వివాదాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు సినీ ప్రేక్షకులు అబ్బూరపడగా, కేదార్ నాథ్ ఆలయ పూజార్లు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసారు.

2013లో జరిగిన ఉత్తరాఖండ్ వరదన నేపధ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను నిషేధించకపోతే భారీ ఆందోళనలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సినిమాలో ముస్లిం యువకుడు – ఓ హిందూ యువతిని మోసుకెళ్తున్నట్లు చూపించారు, అసలు కేదార్ నాథ్ కు ముస్లింస్ రారని, అలాగే వేలాది మంది వరదలో కొట్టుకుపోతుంటే మధ్యలో ముద్దుసీన్లు పెట్టారని తమ అభ్యంతరాలను తెలిపారు.

ఇది లవ్ జిహాద్ ను ప్రేరేపించేలా ఉందని, తమ మనోభావాలను దెబ్బతీసిందని చెప్పిన ఆలయ పూజారులు ఖచ్చితంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని కోరారు. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఈ టీజర్ ను విడుదల చేసారు. దీంతో సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ టీజర్ కు వివాదాలు చుట్టుముట్టాయి.