KCR - YS Jaganదేశంలో ఎక్కడాలేని రీతిలో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వాలు చేసినంత అభివృద్ధి ఏ ప్రభుత్వం కూడా చేయడంలేదు. ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు గొప్పలు చెప్పుకుంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకున్నా…ప్రజల కోసం..కాదు కొన్ని వర్గాల కోసం వారు ప్రకటించే పథకాలతో తరచుగా వార్తల్లోకి ఎక్కుతుంటారు.

పెట్రోల్, డీజీల్ ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు అందుకోలేనంతగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ వ్యాట్ ను తగ్గించింది. రాష్ట్రాలు తమ వాటా కింద వడ్డించే వ్యాట్ నుంచి ఎందుకు తప్పించరన్న ప్రశ్నకు మాత్రం తెలుగు రాష్ట్రాలు జవాబు చెప్పలేని పరిస్థితి.

ఇదంతా ఇలా ఉంటే…రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలకు కేంద్రం కళ్లెం వేసింది. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకాన్ని 5, 10 చొప్పున తగ్గించింది. కేంద్రం నోటి నుంచి ఈ నిర్ణయం రాగానే…బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా పెట్రోల్, డీజీల్ పై విధించే వ్యాట్ ను కొంతమేర తగ్గించాయి. దీంతో వినియోగదారులకు కాస్తంత ఉపశమనం లభించినట్లైంది.

అయితే తెలుగు రాష్ట్రాల సీఎంల పరిస్థితేంటి. వారెందుకు మౌనంగా ఉన్నారు. రాష్ట్రాలు విధించే వ్యాట్ పోటును తగ్గించే అంశంపై ఇప్పటివరకు ఎందుకు ప్రకటన చేయలేదు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ పన్ను వాటాను కొంతమేర తగ్గించేసుకున్నాయి.

ఇలా నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఒక్క ఒడిశాలో నవీన్ పట్నాయన్ ప్రభుత్వం ఉంది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా….వ్యాట్ భారాన్ని తగ్గించుకునే రాష్ట్రాల్లో ఒడిశా నిలిచింది. వ్యాట్ ను తగ్గించిన 12 రాష్ట్రాల్లో ముందు వరుసలో గోవా సీఎం నిలిచారు.

కేంద్రం ప్రకటించిన వెంటనే తమ రాష్ట్రంలో పన్ను పోటును తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలు ఎంతో కొంత వ్యాట్ ను తగ్గించుకున్న సందర్భంలో…తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడంలేదన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండూ దొందే దొందే అన్నట్లుగా ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ, రేపు కానీ ఏమైన ప్రకటిస్తే….రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నిజంగానే హీరోలవుతారు.