KCR - YS Jagan - RTC Assets Shareజగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత అన్నదమ్ముల వలే మెలిగేవారు. జగన్ తరచూ హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ని కలిసేవారు. హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ బిల్డింగులను ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణకి ఇచ్చేశారు. అదేంటి అంటే సుహృద్బావ వాతావరణంలో విభజన సమస్యలు పరిష్కరించుకుంటాం అని చెప్పేవారు.

అయితే అటువంటిది ఏమీ ఇప్పటివరకూ జరగకపోవడం విశేషం. తాజగా ఆర్టీసీ ఆస్తుల పంపకంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మరో షాక్ ఇచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్టీసీ 11 ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ దాదాపుగా 34000 కోట్లు అని అంచనా. వీటిని జనాభా ప్రాతిపదికను విభజించాలని ఏపీ డిమాండ్.

అయితే దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు దాదాపుగా 16000 కోట్లు రావాల్సి ఉంది. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటుంది. కేవలం బస్సు భవన్ లో మాత్రమే వాటా ఇస్తామని ప్రతిపాదిస్తుంది. దాని విలువ కేవలం 76 కోట్లు మాత్రమే. అసలు ఆంధ్రప్రదేశ్ అడిగిన దానికి తెలంగాణ ఇస్తాము అనే దానికి పొంతనే లేదు.

కేసీఆర్ ఇటువంటి వైఖరి ప్రదర్శించడం వల్లే జగన్ నొచ్చుకున్నారని అంటున్నారు. తాను కొంత పట్టువిడుపుకు రెడీ అని కాకపోతే మొత్తంగా కేసీఆర్ ఇష్టం అన్నట్టు వదిలేస్తే అది తనకు కూడా రాజకీయంగా నష్టమని, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని జగన్ భావన. ఇందుకోసమే కేసీఆర్ తో కాసింత దూరంగా ఉంటున్నారని అధికారాల వర్గాల భోగట్టా.