KCR worries about Gajwelకొద్ది కాలంగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వెల్ లో కేసీఆర్ ఎదురీదుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అది నిజామా అన్నట్టు మంత్రి హరీష్ రావు గత రెండు నెలలుగా అక్కడే మకాం వేసి అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరో వైపు గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డి నివాసంలో నిన్న అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. కొంపల్లిలోని తన నివాసానికి సోదాల పేరుతో పోలీసులు వచ్చి హుల్ చల్ చేశారు. ఇంట్లో సామాను అంతా చిందరవందరగా పడేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

పోలీసులు తనన వేధిస్తున్నారంటూ వారి ముందే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. పోలీసులు తనన ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్‌ వారెంట్‌ లేకుండా అర్థరాత్రి సమయంలో ఇంటికి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రతాప్‌ రెడ్డిని పోలీసులు చంపేస్తారంటూ అక్కడికి చేరుకున్న ఆయన మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. ఇంట్లో నగదు, మద్యం భారీగా ఉందని ఎన్నికల అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారని, వారి ఆదేశాల మేరకు ఇంట్లో సోదాలు చేసేందుకు వచ్చామని పోలీసులు వివరించారు.

కాగా సోదాలు నిర్వహించినప్పటికి ఆయన నివాసంలో ఏమీ దొరకలేదని అధికారులు ప్రకటించారు. గెలుపుపై కేసీఆర్ కు ఎటువంటి అనుమానం లేకపోతే ఒక చిన్న స్థాయి నాయకుడిని ఎందుకు ఇంతగా టార్గెట్ చేస్తున్నట్టు? నిజంగానే గజ్వేల్‌ లో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? వంటేరును ఎలా అయినా నిలువరించే క్రమంలోనే ఆయన మీద దాడులు చేస్తున్నారా? జరుగుతున్న పరిణామాలతో ఇటువంటి అనుమానాలు రాకమానవు. గత కొద్ది సంవత్సరాలలో ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో ఎంతగానో పని చేశారు. కేసీఆర్ తప్ప ఎవరు పోటీ చేసినా ఆయన 2014లో గెలిచే ఉండేవారని చాలా మంది అభిప్రాయం.