kcr will not listen to anyone“తాను అనుకున్నది చేసి తీరే రకాన్నే గాని, ప్రజలకు మేలు జరుగుతుందని భావించే పనుల విషయంలో వెనుకంజ వేయబోనని, ఎవరి మాటా వినే ప్రసక్తే లేదని” తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో విపక్షాలు చేసిన పలు విమర్శలకు సుధీర్ఘ వివరణతో కూడిన సమాధానాలు ఇస్తూ, తన మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు.

“మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్, మెట్రో ప్రాజెక్టు, మహారాష్ట్రతో చేసుకున్న జల ఒప్పందాలు, రహదారుల అభివృద్ధి, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి చారిత్రాత్మక ఒప్పందాల సమయంలోనూ ప్రతిపక్షాలకు విమర్శించడం విపక్షాలకు పనిగా మారిపోయిందని, మంచి పనికి సహకరించాలన్న ఇంగిత జ్ఞానం వారికి లేకుండా పోయిందని, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే దిశలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందడుగేనని, ప్రజలకు అధునాతన వైద్య సేవలను అందించే దిశగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు, విదేశాల్లోని ఆసుపత్రులను పరిశీలించి వచ్చామని, త్వరలో గంజి నీరు తాగే పేదకు కూడా కార్పొరేట్ వైద్యం అందుతుందని, ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్రమాలు పెరిగిపోయాయని, త్వరలోనే వాటికి శుభంకార్డు వేస్తామని” అన్నారు.

తెలంగాణ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ హయాంలో లోయర్ పెన్ గంగను ఎందుకు నిర్మించలేదు? సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శల వర్షం కురిపించారు. యూనివర్శిటీలలో కిస్ ఫెస్టివల్ లాంటివి మనదేశంలో నిర్వహిస్తారా? అసలు ఇటువంటి ఫెస్టివల్ లు యూనివర్శిటీల్లో ఎందుకు నిర్వహిస్తున్నారని, హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల, జేఎన్ యూ ఘటనలు దురదృష్టకరమని, యూనివర్శిటీలకు సరైన వీసీలు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని, అందుకే అలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పవర్ ఫుల్ వైస్ ఛాన్స్ లర్ల నియామకం త్వరలోనే జరుగుతుందని కేసీఆర్ అన్నారు.