KCR will be trouble if not changed yetరెండవ సారి అధికారంలోకి వచ్చాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకింత లెక్కలేనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఆ వైఖరితో పొసగకే ఈటల కూడా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ మధ్యకాలంలో ప్రభుత్వంలో మంత్రి హరీష్ రావు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే ఎప్పుడు ఈటల లాగా బయటపడలేదు.

ఈటల పార్టీ నుండి బయటకు వెళ్లిన దగ్గర నుండీ ప్రత్యక్షంగా పరోక్షంగా హరీష్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. “సీఎం కేసీఆర్‌ కేవలం పార్టీ అధ్యక్షుడే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానం. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నా. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటా,” అంటూ హరీష్ తన పై వస్తున్న వదంతులకు సంజాయిషీగా చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగకుండా… “నేను నిబద్ధత, విధేయత, క్రమశిక్షణగల కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ ఏ పని అప్పగించినా పూర్తి చేయడం నా విధి. కేసీఆర్‌ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం కర్తవ్యంగా భావిస్తా’’ అని హరీశ్‌ పేర్కొన్నారు,” అన్నారు కూడా. హరీష్ ఈ విషయాల పై తన వైఖరి స్పష్టం చేసారు.

అయితే హరీష్ కు పార్టీలో ప్రభుత్వంలో ఇబ్బందులు కలిగాయి అనేది వాస్తవం. ఈటల వంటి వారు ఒకరకంగా స్పందిస్తే…హరీష్ వంటి వారు ఇంకో రకంగా స్పందించవచ్చు. ఈరోజు విధేయుడిని అని చెప్పుకున్న హరీష్ ఎప్పుడు అలాగే ఉంటారని కూడా లేదు. పార్టీలోని అందరినీ కలుపుకుని వెళ్లకపోతే అది కేసీఆర్ కే నష్టం. పరిస్థితులు మునుపటిలా లేవు.

రెండో టర్మ్లో ఏ ప్రభుత్వం మీదైనా ప్రజలు అసహనంగా ఉండటం సహజంగా… బీజేపీ అవకాశం కోసం వేచి చూస్తుంది. అటువంటి తరుణంలోపార్టీలో మొదటి నుండీ ఉన్న వాళ్ళు ఇమడలేకపోతే అది ప్రజలకు తెలంగాణకోసం పోరాడిన వారికీ తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పటికైనా మారకపోతే కేసీఆర్ కే ఇబ్బంది.