KCR Harish Raoఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాను ఆరోగ్యంగా బాగనే ఉన్నానని, మరో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. కొత్తపార్టీ విషయాన్ని లేవనెత్తి పరోక్షంగా కామెంట్ చేశారు. ఇప్పుడది ఆశక్తి రేపుతోంది.

తెలంగాణలో నాయకత్వ మార్పు జరిగితే హరీష్ రావు కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు ఉన్నాయి. ఆ విషయం డైరెక్ట్ గా ప్రస్తావించకుండా హరీష్ నే అన్నారా లేక అలా అనుకుంటున్నా వారిని అన్నారా అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. “కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా ? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు. ఎటూకాకుండా పోతారు’’ అని వ్యాఖ్యానించారు.

“1985లో టీడీపీ తరఫున నేను సిద్దిపేట నుంచి, రామచంద్రారెడ్డి దొమ్మాట నుంచి ఒకేసారి గెలిచాం. కొన్నాళ్లకు జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి తదితరులతో కలిసి రామచంద్రారెడ్డి టీడీపీ నుంచి బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రె్‌సలో చేరారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి టికెట్‌ కూడా రాకుండా ఆ తరువాత తెరమరుగయ్యారు. రామచంద్రారెడ్డి కోసం సిద్ధిపేటలో ఇటీవల నేనే ఇంటి స్థలం ఇప్పించి.. నిర్మాణానికి ఆర్థికసాయం కూడా చేశాను. రాంగ్‌ ట్రాక్‌లో వెళితే ఇలాగే ఉంటుంది. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే’’ అని అన్నారు.

కేసీఆర్ చెప్పినదాంట్లో చాలా వరకు నిజమనే చెప్పుకోవాలి… అయితే కొత్త పార్టీ అనే కాకుండా ఇప్పుడు బలంగా ఉన్న బీజేపీ లో చేరే అవకాశం కూడా అసంతృప్త నేతలకు ఉంటుంది. బహుశా దానిని దృష్టిలో పెట్టుకునే ఆయన నాయకత్వ మార్పు వాయిదా వేసినట్టున్నారు. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం మొదలైతే నాయకులు జారిపోవడం చాలా సహజం.. ఈ విషయం తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ లను అదే పాయింట్ మీద దెబ్బకొట్టిన కేసీఆర్ కు తెలియంది కాదు.