KCR huzurabad elections BJP Press meetతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చాలా ఆవేశంతో ఊగిపోయారు. కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీనే టార్గేట్ చేస్తూ ఘాటుగా స్పందించారు. ఈ మధ్య జరిగిన హుజురాబాద్ ఉపఎన్నిక అసలే ఎన్నికనే కాదన్న రీతిలో మాట్లాడుకొచ్చారు కేసీఆర్.

పార్టీ అన్నాక గెలుపోటములు సహజం. హుజురాబాద్ లో టీఆరెస్ ఓడిపోవడం అనేది మామూలు విషయం.అదొక్క గొప్ప విషయంగా పరిగణిస్తున్నారు. నాగార్జున సాగర్ లో జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. తుక్కుగా ఓడిపోయింది. మరి దాన్నేమంటారు. ఉపఎన్నికలంటే గెలుస్తాం, ఓడుతాం…అదొక్క పెద్దవిషమే కాదంటూ చాలా తేలిగ్గా తీసిపారేశారు.

ఇంత తెలిగ్గా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్…హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం మొత్తం బెటాలియన్ను అంతా కూడా అక్కడ దింపింది. దాదాపు 5వందల కోట్లు ఖర్చు పెట్టింది. అకస్మాత్తుగా దళిత బంధు అనే ఓ కొత్త స్కీంను కేవలం హుజూరాబాద్ ప్రజలకే అన్నట్లు పైలెట్ ప్రాజెక్టు కింద ప్రవేశపెట్టింది.

హుజూరాబాద్ ఓటమి అనేది కేసీఆర్ కు ఒక సవాల్ కాకపోతే…మీడియా ముందుకు వచ్చి ఇంత ప్రస్టేషన్ తో మాట్లాడుతుండేనా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆ మీడియా సమావేశాల్లో బీజేపీ గురించి ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత ఉన్నట్లుండి…బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారన్న సందేహం తలెత్తుతుంది.

హుజూరాబాద్ లో టీఆరెస్ ఓటమి వేడి కేసీఆర్ కు తగలడం వల్లే… ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం…బీజేపీపై మండిపడ్డారని జనం అనుకుంటున్నారు. ఈ సమావేశంలో రైతు వ్యతిరేక చట్టాల గురించి, పెట్రోలు, డీజీల్ ధరల గురించి, కోవిడ్ సమయంలో గంగా నదిలో శవాలు తేలాయని…అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఆక్రమణలకు పాల్పడుతుందని ఏవోఏవో మాటలు, ఆరోపణలు ఫ్రస్టేషన్లో చెప్పుకొచ్చారు.

మొత్తానికి హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి వేడి కేసీఆర్ తగిలినట్లు క్లియర్ కట్ గా కనిపిస్తోంది.