KCR Telangana Government Lets Down Hyderabad For The Second Time in A Weekతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ బలంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఎదురుదాడి ఆసక్తి గొలుపుతుంది. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన బీజేపీ పై విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.11వేలకోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం కేవలం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని చెప్పారు.

కానీ భాజపా నేతలు మాత్రం పింఛనులో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు, తాను అబద్ధాలు చెబుతున్నట్టు ప్రచారంచేస్తున్నారని సీఎం మండిపడ్డారు. పింఛన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధమని ఎవరైనా నిరుపిస్తే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతానని సవాల్‌ విసిరారు.

నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాంగ్రెస్ ని కూడా వదిలేసి కేసీఆర్ బీజేపీ గురించే మాట్లాడుతున్నారంటే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది అనే అనుకోవాలేమో!