KCR Visits Director K Viswanath houseతెలుగు సినీ దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉన్నఫళంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదు. మీరు మళ్లీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీసేందుకు సిద్ధమైతే, నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దీని కోసం ప్రణాళిక సిద్ధం చేయండని కేసీఆర్ చెప్పడం విశేషంగా ఉంది.

కేసీఆర్ తన ఇంటికి స్వయంగా రావడంతో ఉబ్బితబ్బిబయ్యారు విశ్వనాథ్. కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఉందని .తమ ఇంటికి కెసిఆర్ రావడాన్ని విశ్వనాద్ పోల్చారు.దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు సినిమా తీయాలని అభిమానులు కోరుతున్నారు. నాకు మాత్రం ఓపిక లేదు. ఇకపై నేను సినిమాలు తీయను అని ఆయన మీడియాకు చెప్పడం విశేషం. అయితే కేసీఆర్ కు సడన్ గా కె.విశ్వనాద్ ఎందుకు గుర్తుకు వచ్చారో, వెంటనే ఆయన ఎదుకు వెళ్లారో, అంతేకాక ఆయనకు సినిమా తీయాలని కోరిక ఎందుకు కలిగిందో అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

తెరాస వర్గాలు మాత్రం ఆయన మీద అభిమానంతోనే వెళ్ళారు అంటున్నాయి. కొందరు మాత్రం తెలంగాణాలో బీజేపీ బలపడటంతో బ్రాహ్మణులను మచ్చిక చేసుకోవడం కోసం కేసీఆర్ ఆయన వద్దకు వెళ్లి ఉంటారు అని విశ్లేషిస్తున్నారు. అయితే కే. విశ్వనాథ్ ఎప్పుడు కూడా ఒక కులానికి పరిమితం కాలేదు. దీనితో ఆయనను కలిస్తే ఒక కులాన్ని మచ్చిక చేసుకోవడం కుదురుతుంది అనేది ఎంతవరకు సాధ్యం అనేది అనుమానమే. మరి అసలు కారణం ఏమయివుంటుంది?