What-Happens-After-The-Honey-Moon-Period-for-Jagan-and-KCR's-Bonhomieమై హోమ్ రామేశ్వరరావు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్నపేరు. టీవీ9ను చేజిక్కించుని కేసీఆర్ కోసం వివిధ టీవీ ఛానెల్స్ లో వాటాలు కొనుగోలు చేస్తున్నాడు. టీవీ9ను స్థాపించిన రవిప్రకాష్ ను కేసులలో ఇరికించి ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఇది ఇలా ఉండగా దైవ చింతన ఎక్కువగా ఉండే కేసీఆర్ ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైౖర్మన్‌ పదవికి ఒంగోలు మాజీ ఎంపీ, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి నియమింపబడ్డారు. ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. బోర్డు మెంబర్లను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. మహారాష్ట్ర, తెలంగాణా, తమిళనాడు కోటాలో ముగ్గురు సభ్యులను తీసుకోవడం ఎప్పటినుండో ఆనవాయితీగా ఉంది. తెలంగాణ కోటాలో మై హోమ్ రామేశ్వరరావును తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇటీవలే విజయవాడ వచ్చిన కేసీఆర్ ఈ విషయం జగన్ కు చెప్పారట.

ఆయనకూడా సానుకూలంగా స్పందించారట. తమిళనాడు నుంచి శేఖర్ రెడ్డి కూడా మళ్లీ బోర్డ్ సభ్యత్వ పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల అంశంలో వివాదాలు చెలరేగడంతో శేఖర్ రెడ్డిని గత ప్రభుత్వం బోర్డ్ మెంబర్ గా తొలగించిన విషయం తెలిసిందే. మరోవైపు బోర్డు సభ్యుల నియామకం గురించి ముఖ్యమంత్రి వద్ద ఇప్పటికే పైరవీలు గట్టిగా జరుగుతున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట.