KCR's Dream Secretariat To Be Inaugurated on Ugadi?తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆప్తుడు, రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖుడు గా ఉన్న జూపల్లె రామేశ్వరరావు కు చెందిన మైహోం గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం సంచలనంగానే ఉంది.మై హోం గ్రూపునకు చెందిన అన్ని కార్యాలయాలు, నివాసాల్లో ఐటి దాడులు జరగటం ఆసక్తికర పరిణామంగా మారింది. గత కొంత కాలంగా మై హోం గ్రూప్ మీడియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.ఈ తరుణంలో ఐటి రంగంలోకి దిగటం ఆసక్తికర పరిణామంగా మారింది.

గత ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ కేంద్రంతో మంచి సంబంధాలు నెరిపారు. 2019 ఎన్నికల తరువాత మెజారిటీకి దగ్గరలో ఆగిపోతే కేసీఆర్ అవసరం పడుతుందని భావించి తెరాస పట్ల బీజేపీ కూడా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబుతో పోల్చి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో కేసీఆర్ ని పొగిడారు. అయితే ఎన్నికల తరువాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది అదే సమయంలో ఆ పార్టీ తెలంగాణలో నాలుగు సీట్లు గెల్చుకుంది.

దీనితో తెలంగాణాలో 2024 ఎన్నికల సమయానికి అవకాశం కనిపించడంతో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. గతంలో చంద్రబాబును వేధించినట్టుగానే కేసీఆర్ మీద కూడా అదే మంత్రం ప్రయోగిస్తున్నట్టుగా ఉంది. ఇందులో భాగం గానే జూపల్లె రామేశ్వరరావు కు చెందిన మైహోం గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం. దీనితో కేసీఆర్ కు ఇబ్బందులు మొదలయినట్టే అనుకోవాలి. అయితే చంద్రబాబుతో డీల్ చేసినంత ఈజీ కాదు కేసీఆర్ తో వ్యవహారమంటే అంటున్నారు తెరాస నేతలు.