KCR-Government-Taking-People-For-Grantedతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన జాతీయ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇటీవలే మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన ఆయన మరో పార్టీ నేతను కలవడానికి సిద్ధం అవుతున్నారు. మే మొదటి వారంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్) తో సమావేశం కానున్నారు.

దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకరావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరగనుంది. ప్రస్థుతం ఒరిస్సాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మే మొదటి వారంలో భువనేశ్వర్ రావలసిందిగా నవీన్ పట్నాయక్ సిఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ అంగీకరించారని సమాచారం.

అయితే కాంగ్రెస్, బీజేపీ లేని ఫ్రంట్ ఏర్పాటు ఎంతవరకు సాధ్యపడుతుందో అనేది విశ్లేషకులకు కూడా అనుమానంగానే ఉంది. కర్ణాటక ఎన్నికలు హంగ్ వైపు వెళ్తే దీనిపై క్లారిటీ వెంటనే వచ్చేస్తుంది. హంగ్ వస్తే దేవెగౌడ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్ళకుండా స్వతంత్రంగా వ్యవహరించగలదేమో చూడాలి.