KCR-Reviews-The-Progress-of-Cash-for-Vote-Caseతెలంగాణలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి చేస్తూ మార్చిలో కేసీఆర్ ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే పాఠశాలలు దీనికి సీరియస్ గా తీసుకోకపోవడం తో అమలు చేయని పాఠశాలల యాజమాన్యాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ఇలాంటి బడులకు రెండుదఫాలు జరిమానా విధించి.

తర్వాత కూడా చట్టాన్ని అతిక్రమిస్తుంటే అనుమతులను రద్దు చేస్తుంది. రాష్ట్ర పాఠ్య ప్రణాళికతోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ తదితర బోర్డుల ప్రైవేట్‌ పాఠశాలలు తెలుగు అమలు చేయకుండా మొదటిసారి పట్టుబడితే రూ.50 వేలు జరిమానా, రెండోసారి అయితే రూ.లక్ష జరిమానా విధిస్తారు. మొదటిసారి నిబంధనలు అతిక్రమించారని గుర్తిస్తే అధికారులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తారు.

ఒకవేళ ఉల్లంఘన చేస్తున్నారని నిర్ధరణకు వస్తే లోపాలను సవరించుకోవడానికి నెల గడువు ఇస్తారు. ఆలోపు అమలు చేయని పక్షంలో మొదటి ఉల్లంఘనగా రూ.50 వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తారు. తర్వాత కూడా నిబంధనల ఉల్లంఘన కొనసాగితే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తారు. ఏదో నామ్ కే వాస్తే గా కాకుండా చిత్తశుద్ధితో తెలుగును ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి జోహార్లు.