KCR-TRS-Telangana-Latest-News-MLAజాతకాలను తెలంగాణా ముఖ్యమంత్రి ఎంతగా విశ్వసిస్తారో నేటి ఉదంతం చూసిన తర్వాత ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. ఇంకా ఏడెనిమిది నెలల పాలన చేతిలో ఉండగానే, ముందుగా ఎన్నికలకు వెళ్ళడం అనేది జ్యోతిష్య ప్రభావమేనన్నది బహిరంగమే. అందుకే అందుకు వేదికగా తనకు అచ్చివచ్చిన సెప్టెంబర్ మాసాన్ని కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు.

ఒక్కసారి కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే సెప్టెంబర్ మాసం ఎంత కీలక పాత్ర పోషించిందో అవగతం అవుతుంది. 2001 సెప్టెంబర్ 22వ తేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సిద్ధిపేట నియోజకవర్గం నుండి కేసీఆర్ గెలుపొందారు. అలాగే 2006 సెప్టెంబర్ 12వ తేదీన కరీంనగర్ ఎంపీగా రిజైన్ చేసారు. ఇక తాజాగా 2018 సెప్టెంబర్ 6వ తేదీన టీఆర్ఎస్ సర్కార్ ను రద్దు చేసారు.

సెప్టెంబర్ నెల కేసీఆర్ ను వెంటాడుతుందో లేక కాకతాళీయంగా కేసీఆర్ అన్ని ముహూర్తాలను సెప్టెంబర్ లో ఖరారు చేసుకున్నారో గానీ, కేసీఆర్ రాజకీయ జీవితంలో సెప్టెంబర్ మాసం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో సెప్టెంబర్ వచ్చిందంటే… అందరి కళ్ళు ఇక కేసీఆర్ వైపుకు చూడడం సహజం. జాతకం అంటే ఇదేనేమో…!?