The Sooner KCR Realizes, The Better For Himతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వారే. తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస వారిని తరచూ టార్గెట్ చేసేది. అయితే ఒకసారి రాష్ట్రవిభజన అయ్యాకా పరిస్థితులు మారిపోయాయి. ఇండస్ట్రీ సెలెబ్రిటీలు రాజీ పడి ప్రభుత్వ పెద్దలకు క్లోజ్ అయిపోయారు. చాలా మంది ఏకంగా భజనపరులుగా మారిపోయారు.

ఆ తరువాత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ సమస్యపైనా వారు ఎప్పుడూ స్పందించలేదు. అయితే, అప్పుడు కొందరు ప్రముఖులు ఇప్పుడు మొట్టమొదటి సారిగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. రాష్ట్రంలో కరోనా సంక్షోభాన్ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని వారు విమర్శిస్తున్నారు.

జూనియర్ వైద్యులు నిన్న గాంధీ ఆసుపత్రిలోని అన్ని కరోనా స్పెషల్ వార్డులలో తమ రెగ్యులర్ విధులను బహిష్కరించారు. వారి సమ్మె ఇంకా కొనసాగుతోంది. కరోనా పై యుద్ధంలో జరుగుతున్న అనేక తప్పులపై వారు గళం ఎత్తుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు రాశి ఖన్నా, నాగ్ అశ్విన్, హరీష్ శంకర్, దేవ కట్టా, వెంకీ అట్లూరి తదితరులు వారికి మద్దతుగా వీడియోలు, సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.

ఈ తిరుగుబాటు బట్టి తెలంగాణ ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలంగా లేవని స్పష్టం అవుతుంది. ఈ ఉదంతంలో ప్రభుత్వానికి ఒకే ఒక్క పాజిటివ్ ఏంటంటే స్టార్స్ ఎవరు నోరు మెదపకపోవడం. ఈ సంక్షోభాన్ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేకపోతే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవు.