KCR-to-Dissolve-The-Assembly-in-Septemberతనదైన శైలిలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వచ్చే నెలలో ప్రకటిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వెల్లడించడంతో ఆ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే నెలలోనే అభ్యర్థుల ప్రకటన అనడంతో సర్వత్రా ముందస్తు ఊహాగానాలు ఉన్నవి. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఐదారుగురు మినహా సిట్టింగులకే టిక్కెట్లు అని చెప్పడంతో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో టెన్షన మొదలయ్యింది. ఆయా నియోజకవర్గాల నుంచి టిక్కెట్‌ ఆశిస్తూ పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేల ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి అనడంతో వారికి ఎటూ పాలుపోవడం లేదు.

సిట్టింగులకే టిక్కెట్లు అనడంతో పక్క పార్టీలనుండి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా రిలాక్స్ అయ్యారు. అయితే ఆయా నియోజకవర్గాలలో పాత నాయకులు నిరుత్సాహపడిపోయారు. దీని ప్రభావం పార్టీ మీద ఏ మాత్రం ఉంటుందో చూడాలి. మరోవైపు వచ్చే నెల 2న హైదరాబాద్‌ శివారులో భారీ బహిరంగ సభను నిర్వహించి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు నివేదించనున్నారు. మరోసారి తమకు పట్టం కట్టేందుకు ఆశీర్వదించాలని ఈ సభ ద్వారా కోరనున్నారు.