KCR Telangana CMO coronavirusభారత్ లో కరోనా అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న రోజులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ విధించారు. ప్రపంచంలో చాలా దేశాలకంటే ముందుగా లాక్ డౌన్ విధించారని అంతా పొగిడారు. మోడీ కూడా ఉత్సాహంగా వారానికో రెండు వారాలకో ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ… ఏవేవో టాస్కులు ఇచ్చేవారు.

అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా మీడియా ముందుకు వచ్చి, ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపరిచేవారు. పీపీఈ కిట్లు లేవని రాసిన మీడియా అధిపతికి కరోనా రావాలని శపించడం, కర్ఫ్యూ టైం లో బయటకనిపిస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తా అని, టెస్టులు చెయ్యడం లేదు అన్న మీడియా మీద విరుచుకుపడటం వంటి సిత్రాలు ఎన్నో.

కేసీఆర్ ఏకంగా తెలంగాణలో కరోనా కనుమరుగయ్యే డేట్లు కూడా చెప్పుకొచ్చారు. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ టెస్టులు చెయ్యడం లేదేంటి అంటే ఎక్కువ టెస్టులు చేస్తే ప్రైజ్లు ఏమన్నా ఇస్తారా అంటూ వెటకారం కూడా చేశారు. ఆ తరువాత అసలు సీన్ మొదలయ్యింది. అటు దేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి… ఇటు తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోయే స్టేజ్ వచ్చేసింది.

ఇప్పుడు అటు మోడీ… ఇప్పుడు కేసీఆర్ ఎప్పటిలాగే తమ మొహం చాటేస్తున్నారు. వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి చాలా రోజులు అయ్యింది. కేటీఆర్ అయితే కరోనా గురించి తప్ప అన్నిటి గురించీ ట్వీట్లు చేస్తున్నారు. సమయం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు సింహం లాగా లేనప్పుడు ఇంకోలా ఉంటున్నారు మన నాయకులు అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు.