Pity-That-Our-Country-People-to-have-a-Lying-PM---KCRతెలంగాణ ముఖ్యమంత్రిగా మరొక్కసారి రేపు ప్రమాణస్వీకారం చెయ్యబోతున్న కేసీఆర్ దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు అవసరముందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, భాజపా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని.. ఆ రెండు పార్టీలూ దొందూ దొందేనని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆయన త్వరలో ఒక సరికొత్త జాతీయ పార్టీ రాబోతుందని చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే రెండు మూడు నెలలలో ఆయన తన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చెయ్యబోతున్నారు.

కేంద్రంలోని ప్రభుత్వాల ఫ్యూడల్ వైఖరి నశించనంత వరకూ దేశంలో సమూల మార్పులు రావని.. అలా జరగాలంటే ధైర్యం, సాహసం అవసరమన్నారు. ఆ సాహసాన్ని తాను చేస్తున్నాని.. ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తానని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలలో సక్సెస్ కావడానికి తెలంగాణాలో విజయవంతమైన రైతు బంధు పథకాన్నే ఆయన ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. .

“దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం,” అని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఒక ప్రాంతీయ పార్టీ నేత అందునా దక్షిణాదిన నుండి వచ్చిన నేత దేశ రాజకీయాలను ప్రభావితం చెయ్యగలరా అనేది చూడాలి. గతంలో చేసిన థర్డ్ ఫ్రంట్ లాంటి ప్రయత్నమే ఇది కూడా అయితే విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఈ పథకం నిజంగా ప్రజలలోకి బాగా వెళ్తే ఇప్పటికే ఉన్న జాతీయ పార్టీలు కూడా తాము అమలు చేస్తామని చెప్పేస్తే వాటికే అక్కడి ప్రజలు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పూర్తి ఎజెండా తెలియకుండా కొట్టి పారేయడం కూడా కరక్టు కాదు.