KCR's-Return-Gift-to-Chandrababu---Lakshmi's-NTRచంద్రబాబుకు ఎక్కడ మేలు జరుగుతుందో అని ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడని కేసీఆర్ మొత్తానికి నోరు విప్పారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని తాను చేసిన సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు కేసీఆర్ సెంటిమెంట్ వాడుకోకుండా జాగ్రత్త పడ్డారు. “పక్క రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం, మా ఎంపీలు ప్రత్యేకహోదా కోసం పనిచేస్తారు, ఆంధ్రా ప్రజలు మంచివారే, బాబు లాంటి పిడికెడుమంది మందితోనే పంచాయితీ,” అని చెప్పుకొచ్చారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే పక్క రాష్ట్రం బాగు కోరుకునే కేసీఆర్ పది రోజుల క్రితమే పోలవరం పనులు ఆపాలని సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున పిటిషన్ వేయించారు. ప్రత్యేక హోదా కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానం కు మద్దతు ఇవ్వని కేసీఆర్ ఆంధ్రలోని రహస్యమిత్రుడి కోసం తమ ఎంపీలను పంపుతాం అని చెబుతున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు చేసిన ప్రకటనలోని నిగూడ మర్మం ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియనిది కాదు.

2014 ఎన్నికల తరువాత కేసీఆర్ పెట్టిన మొట్టమొదటి ప్రెస్ మీట్లో కూడా ఆయన ఇదే మాట అనడం విశేషం. జగన్ గెలవడం ఖాయమని మేము రెండు రాష్ట్రాల కోసం కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. “నో డౌటు… జగన్ మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టూ బీట్ ది డ్రమ్స్” అంటూ గట్టిగా చెప్పారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. మిత్రుడు శత్రువుకి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో కేసీఆర్ ఎటుపక్క ఉంటారు అనేది అంచనా వెయ్యాలంటే పెద్దగా తెలివి తేటలు ఉండాల్సిన అవసరం లేదు.