KCR - TRS Pragathi Nivedana Sabha‘ప్రగతి నివేదన సభ’ పేరుతో కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనాలను తరలించడంలో క్యాడర్ సక్సెస్ అయ్యింది. అంచనాలు వేసిన దాని కంటే తక్కువ మందే వచ్చినా, ఈ జనసమూహం టీఆర్ఎస్ కు ఉత్సాహాన్నిచ్చింది. ఇక ముందస్తు ఎన్నికల గురించి ఈ సభలో కీలక ప్రకటన వస్తుందని భావించగా, అందుకు విరుద్ధంగా ముందస్తు ఎన్నికలపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చేస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించడం విస్మయానికి గురిచేసే అంశం.

దీనిపై సాక్షి మీడియా తాజాగా ఓ కధనాన్ని ప్రచురితం చేసింది. ఈ నెల 6వ తేదీన తెలంగాణా సర్కార్ ను రద్దు చేయనున్నారని, ఇది తమకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినట్లుగా చెప్పుకొచ్చింది. నిజానికి ఈ వార్తలు ఇతర మీడియాలలో కూడా వచ్చిన సంగతి తెలిసిందే గానీ, దానిని సాక్షి బల్లగుద్ధినట్లు చెప్పడంతో, బహుశా ఈ నెల 6వ తేదీతో కేసీఆర్ సర్కార్ కు శుభంకార్డు పడిపోయే అవకాశం పుష్కలంగా కనపడుతోంది.

గత ఎన్నికల నుండి జగన్ కు – కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం బహిరంగమే. ‘దత్తపుత్రుడు – అద్దెపుత్రుడు’గా వీరిద్దరినీ కీర్తించగా, లోపాయికారికంగా వీరిద్దరూ ఒక్క లక్ష్యం కోసమే పనిచేసిన వైనం రాజకీయ విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే గత అయిదేళ్ళుగా కూడా ఏపీకి న్యాయం జరగాల్సిన కొన్ని విషయాలలో టీఆర్ఎస్ సర్కార్ సహకరించకపోయినా, కేసీఆర్ నే వెనుకోసుకోస్తూ ప్రసారం చేసిన కధనాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.