KCR -TRS -Pragathi Nivedana Sabha-rs -300 croresసెప్టెంబర్ 2న జరగబోయే ప్రగతి నివేదన సభ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసారు. “1600 ఎకరాల్లో 25 లక్షల మందితో ఆ సభ హోరెత్తాలి. దాని ద్వారా మన బలమేమిటో నిరూపించుకోవాలి. 800 ఆర్టీసీ, ప్రైవేటు 700 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇవిగాక కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు, ట్రాక్టర్లు, మోటార్‌సైకిల్‌లోనూ తరలిరావాలి” అని శ్రేణులకు సూచించారు.

“ప్రగతి నివేదన సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 50 వేల మందిని తరలించాలి. ఎమ్మెల్యేలు దగ్గరుండి జనసమీకరణ జరపాలి. సభకు ఎంతమంది వస్తున్నారో చూస్తే ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా? టికెట్‌ వస్తుందా రాదా తెలుస్తుంది. వచ్చే వారం రోజులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలి. సభకు బస్సులు బయల్దేరాకే రావాలి,” అని ఆయన ప్రకటించారు.

దీనితో ఎన్నికల ఖర్చు అప్పుడే మొదలయ్యిపోయిందని నేతలు అంటున్నారు. 50 వేల మందిని సభకు తరలించాలంటే తలకు 500 రూపాయిలు వేసుకున్నా నియోజకవర్గానికి రెండున్నర కోట్ల ఖర్చు తేలుతుంది. మొత్తం 117 నియోజకవర్గాలకు గానూ దగ్గరదగ్గర 300 కోట్ల ఖర్చు. దీనికి ఏర్పాట్లు మిగతా ఖర్చులు అదనం.