KCR TRS MIM Sercrete Allianceతెలంగాణాలో ఇప్పటికే రెండు కూటములు పబ్లిక్ గా వెలిశాయి. బద్ద శత్రువులైన కాంగ్రెస్ టీడీపీ ఓపెన్ గానే పొత్తు పెట్టుకున్నారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ జన సమితి, సిపిఐలతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు సిపిఎం చిన్న పార్టీలతో కూడా బీఎల్ఎఫ్ పెట్టుకున్నారు. అయితే ఈ రెండు కూటములు కాకుండా తెలంగాణాలో ఒక రహస్య కూటమి కూడా ఉంది. అందులో తెరాస, బీజేపీ మరియు బీజేపీ బద్ధవ్యతిరేకి అని చెప్పుకునే ఎంఐఎం భాగస్వాములు.

ఎంఐఎం తెరాస తాము మిత్రులమే అని బాహాటంగా చెప్పుకున్నాయి. కాకపోతే పొత్తు ఉండదు పోటీలన్నీ స్నేహపూర్వక పోటీలే అని ప్రకటించాయి. ఎంఐఎం స్థానాలలో వారికి ఏ ఇబ్బంది లేకుండా వీక్ కాండిడేట్లను పెట్టింది తెరాస. బీజేపీ తెరాస మధ్య మరో ఆశ్చర్యకరమైన పరిస్థితి ఉంది. సాక్షాత్తు ప్రధాని పార్లమెంట్ లో తెరాస ప్రభుత్వాన్ని పొగుడుతారు ఇక్కడ మాత్రం ఆ పార్టీ నేతలు ఇక్కడకు వచ్చినప్పుడు అమిత్ షా దీనిని అవినీతి ప్రభుత్వం అంటారు.

అయితే నిజానికి నామినేషన్ల ఘట్టం పూర్తి అయ్యాకా అభ్యర్థులను పరిశీలిస్తే బీజేపీ బలంగా ఉన్న చోట్ల తెరాస వీక్ అభ్యర్థులను పెట్టడం, తెరాస బలంగా ఉన్న చోట బీజేపీ వీక్ అభ్యర్థులను పెట్టడం జరిగింది. దీని ద్వారా ఒకరి గెలుపుకు ఒకరు తోడ్పడొచ్చు. అదే సమయంలో ఉప్పు నిప్పు లా ఉండే బీజేపీ, ఎంఐఎంలకు కూడా చీకటి ఒప్పందాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ బలంగా ఉండే చోట్ల ముస్లింలు కాంగ్రెస్ కు గంపగుత్తుగా వెయ్యకుండా ఎంఐఎం తన అభ్యర్థులను నిలబెట్టింది.

అలాగే ఎంఐఎం ఇలాకాలో హిందువులకు టిక్కెట్లు ఇచ్చి ముస్లిం ఓట్లు అన్నీ ఎంఐఎంకు ఒన్ సైడ్ గా పడేలా ప్లాన్ చేసింది బీజేపీ. నిజానికి బీజేపీ ఎంఐఎం పైకి కొట్టుకున్నా వేరే రాష్ట్రాల ఎన్నికలలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ తెరాస మెజారిటీకి దగ్గరలో ఆగిపోతే ఈ రెండు పార్టీలతో కలిసి గవర్నమెంట్ నెలకొలిపే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ రహస్య అవగాహన బయట పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 11న ఫలితాలు విడుదలవుతాయి.