KCR Shock to Kalavakuntla Kavithaకరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అన్ని రాష్ట్రాలనూ తెలంగాణ వైపు చూసేలా చేస్తున్నాయి. ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావాలని, గుంపులుగా ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అయితే ఇవన్నీ రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి పట్టవు అనుకుంట.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ కుమార్తెకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్న తెరాస.. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌కు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఒక చోటకు తరలించి వారికి మందు, విందు ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం ఓ వైపు కరోనా కట్టడి చేస్తుండగా.. తెరాస నిర్వహిస్తున్న రిసార్ట్స్‌లో మాత్రం ఒకేచోట 500 మంది మందు చిందులతో హల్‌చల్ చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇప్పటిదాకా కరోనా వైరస్ నివారణపై తీసుకున్న చర్యలతో ప్రజలందరితో శెభాష్ అనిపించుకుని ఈ విషయంలో మాత్రం తెరాస అభాసుపాలు అయ్యింది. “రాష్ట్ర ప్రజల భద్రత కంటే కవిత ఎమ్మెల్సీ ఎన్నికే ముఖ్యమా?,” అంటూ పలువురు ఆక్షేపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇందుకు బాద్యులు మీద యాక్షన్ తీసుకుంటే ఆదర్శంగా నిలుస్తారు.