KCR - Chandrababu-Naidu
అమాంతంగా వచ్చి పడిన టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు పుకార్లు ప్రకంపనలు రేపుతున్నాయి. టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిఆర్ ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పకపోవడం పై సర్వత్రా ఆసక్తి రేపుతుంది. రేవంత్ వర్గం దీనిపై ప్రత్యేకంగా సమావేశం కూడా జరిపారని సమాచారం వస్తోంది.

పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ సీటుతోపాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. ఐతే ఓటుకు నోటు వ్యవహారంలో తనను ముప్పాతిప్పలు పెట్టిన కేసీఆర్తో కలిసేందుకు రేవంత్ ఎంతమాత్రం సుముఖంగా లేరు. అవసరం ఐతే కాంగ్రెస్ లేదా భాజపా పార్టీలలో చేరేందుకు సిద్దం అవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వంలో ఉన్న వారికి అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత ఉండటం సహజం. ఆ లాస్ను టిడిపి తో పొత్తు వల్ల వచ్చే 5-6%ఓట్లతో పూడ్చుకోవాలని కేసీఆర్ వ్యూహం

టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిఆర్ ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పకపోవడం పై రేవంత్ వర్గం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ముందే భవిష్యత్‌ నిర్ణయించుకోవడం మంచిదని వారు అబిప్రాయపడ్డారట. టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు ఉన్నట్టు ఐతే ఆ ప్రభావం ఆంధ్ర రాజకీయాలపై కూడా తప్పకుండా ఉంటాడి. అటువంటి సందర్భంలో మొదటికే మోసం జరగొచ్చుకూడా. కావున ఈ పుకర్లతో రెండు రాష్ట్రాల్లోని టిడిపి అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు.