KCR to meet Donald Trumpఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో అగ్రరాజ్య అధినేత యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది భారత ప్రభుత్వం. పర్యటన సందర్భంగా ట్రంప్ కు రాష్ట్రపతి కోవింద్ అధికారిక నివాసంలో ప్రధాని లంచ్‌ ఇవ్వనుండగా… ఈ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వనించింది రాష్ట్రపతి కార్యాలయం.

ఈ ఆహ్వనం అందిన వారిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, బీహర్, హర్యానా సీఎంలున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వనం అందిందట. అయితే మరో తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటివరకూ ఆహ్వానం అందలేదని తెలుస్తుంది.

ఏపీతో పాటు తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులకు ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపిస్తున్నారు అనేది కూడా ఇప్పటిదాకా తెలియరాలేదు. మరోవైపు…. కేసీఆర్ ఈ విందుకు హాజరు కాబోతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది.

తెలంగాణలో బీజేపీ, కేసీఆర్‌కు అంతగా పొసగకున్నా ట్రంప్‌ కార్యాక్రమం వంటి వాటికి ఆహ్వనించటం, అదే సమయంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఏపీ సీఏం జగన్‌ను పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఫిబ్రవరి 24-25… రెండు రోజుల భారత పర్యటనలో ట్రంప్ అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ సందర్శిస్తారు.