KCR to dissolve assembly to seek MIM supportతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెలలో అసెంబ్లీని రద్దు చేసి నవంబర్ లో ఎన్నికలు జరగనున్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాన్ లతో పాటు ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారట. అయితే ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ సలహ మేరకే కెసిఆర్ ఈ ఆలోచన చేస్తున్నారని ఒక పత్రిక లో కధనం వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని, లోక్ సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ కూటమికి మద్దతు పలకవలసి ఉంటుందని మజ్లస్ నేతలు చెప్పారట. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే ఈ పరిణామ టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా ఉంటుంది. ముస్లిం మైనార్టీలలో మజ్లిస్ ప్రబావం భారీగానే ఉంటుంది.

వారి సాయం పొందడానికి వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.తెరాస కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేదు.అలాగే మజ్లిస్ బిజెపికి మద్దతు ఇవ్వలేదు. ఈ నేపద్యంలో వయా మీడియాగా ఈ ఆలోచన జరుగుతోందని చెబుతున్నారు. ఈ ప్రకారంగా తెరాస పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి మద్దత్తు ఇచ్చే అవకాశం కూడా ఉంది.

టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వెళ్ళడంతో ఆ లాస్ ను తెరాస తో భర్తీ చేయ్యాలని యోచిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అదే విధంగా ఎన్నికల తరువాత మోడీ కేబినెట్ లో కూడా జాయిన్ కావాలని తెరాస నేతలు ఉవ్విర్లూరుతున్నారు. దీనితో ముందస్తు వ్యూహం అన్ని రకాలుగానూ మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు.