KCR Telugu Mahasabhalu controversy!రాజకీయాల కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలుగు మహాసభలకు పిలవలేదు అన్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ ఎంతో అమితంగా ఇష్టపడే ఎన్టీఆర్ ను కూడా ఈ సభలకు దూరం పెట్టారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ బొమ్మ కానీ పేరు కానీ ఎక్కడ వినపడకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే ఏలిన వారినుండి వింత జవాబు వచ్చింది.

ఎన్టీఆర్ ఒక నటుడుగా ఎన్నో మహానత్తమైన పాత్రలు పోషించి తెలుగు వారిని అలరించారట, అలాగే జనరంజకంగా పాలించి తెలుగు జాతి పై తనదైన ముద్ర వేసుకోవడం నిజమే అని ఒప్పుకుంటుంటే, తెలుగు బాషాకు అవేమి సంబందించినవి కావు కాబట్టి ఆయనను పక్కన పెట్టాం అని కొందరు సమాధాన పరుస్తున్నారు.

పోనీ అలాగే అనుకుందాం కాసేపు… మరి హైదరాబాద్ నగరమంతా నింపేసిన తెలుగు మహాసభల హార్డింగ్ల మీద ప్రొఫెసర్ జయశంకర్ బొమ్మలు ఎందుకు వేసినట్టు? వారు చెప్తునట్టుగా జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి ఆధ్యుడుగాని తెలుగు భాషకు కాదుగా? ఇక్కడ జయశంకర్ బొమ్మలను తప్పుపట్టడం కాదు ఏలిన వారు పెట్టిన వంకలు గురించి చెప్పే ప్రయత్నమే ఇది. ఇదే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహాసభలు అని పెట్టినా తెలంగాణ తెలుగు మహాసభలు అని పెట్టిన అడిగేవారే ఉండరు. కాకపోతే తెలుగు మహాసభలు అని పెట్టడం వల్లే ఈ వాదనలు అన్ని.

ఇదంతా తెలిసి అన్నారో తెలియాలి అని అన్నారో తెలీదు గానీ ఆంధ్ర వాడైనా వెంకయ్య నాయుడు మాత్రం తన ప్రసంగంలో ఇతర ఆంధ్ర, ప్రవాసాంధ్ర ప్రతినిధులూ ! మనందరి భాష తెలుగు కాబట్టి మనమంతా ఒక్కటే అని ఆయన రిపీటెడ్‌గా చెబుతుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఉండాల్సిన వారికి లేని తాపత్రయం వెంకయ్యకు ఉంటె సరిపోతుందా? లేక ఆయన చెబితే సరిపోతుందా?