KCRఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్‌ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … గజ్వేల్‌ ప్రజలు తనను మళ్లీ గెలిపిస్తారని.. అందులో ఎలాంటి సందేహం లేదని కేసీఆర్ అన్నారు.

గజ్వేల్‌ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ తాను చేసింది కొంతేనని పేర్కొన్నారు. తొలి విడతలో రాష్ట్రం కోసం పూర్తి సమయం కేటాయించానని.. ఈసారి గజ్వేల్‌ కోసం కూడా కొంత సమయం కేటాయిస్తానని చెప్పారు. ఇదే క్రమంలో కేసీఆర్ గజ్వేల్ పై వరాల జల్లు కురిపించారు. ఈ నెల 14న నామినేషన్‌ వేస్తున్నానని.. నామినేషన్‌ రోజున ఎవరూ రావొద్దని కేసీఆర్‌ సూచించారు.

ఈ నెల 15 నుంచి ప్రచార సభల్లో పాల్గొంటానని తెలిపారు. కొన్ని సర్వేల ప్రకారం గజ్వేల్ లో కేసీఆర్ ఎదురుగాలి వీస్తున్నట్టు సమాచారం. మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. కేసీఆర్ ఓటమిగానీ స్వల్ప మెజారిటీతో అతికష్టం మీద బయటపడటం గానీ జరుగుతుందని సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ కూడా తన సొంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.