KCR-Reviews-The-Progress-of-Cash-for-Vote-Caseతమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలన్న తీర్పును అమలు చేయక పోవడాన్ని సవాల్‌ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌ కుమార్‌లు దాఖలుచేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో గలాటా చేసి స్పీకర్ పై మైక్ విసిరి గాయపరిచారని వారిపై అభియోగం.

అయితే హై కోర్టు వారికి ఊరటనిచ్చింది. కాకపోతే పంతానికి పోయి స్పీకరుకు ఉన్న విశేష అధికారాలతో కోర్టు తీర్పును అమలు చెయ్యకుండా ప్రయత్నిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీనితో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. అనవసర వివాదాలకు పోకుండా ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గితేనే ప్రభుత్వానికి మంచిదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.