KCR Defends The Ban of Kathi Mahesh and Swami Paripoornandaరాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో ‘ఎన్డీయే, యూపీఏ ఇతర పక్షాల మద్దత్తు కీలకం కాబోతుంది. అందులో తెరాస మద్దతు కీలకం. అయితే ఇటీవలే ప్రధాని మోడీ తో ఇటీవలే జరిగిన భేటీలో మైనారిటీ ఓట్ల దృష్ట్యా బీజేపీ అభ్యర్థిని నిలబెడితే తాము మద్దత్తు ఇవ్వడం కష్టమని, వేరే పార్టీ అభ్యర్థికి అయితే మద్దత్తు ఇస్తామని తేల్చి చెప్పారట.

దానితో జెడియు కి చెందిన హరివంశ్ సింగ్ పోటీచేయవచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అదినేత కెసిఆర్ కు ఫోన్ చేసి మద్దతు అబ్యర్దించారు.పార్టీలో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ తెలిపారు.

అయితే మద్దత్తు ఇవ్వడం ఖాయమని బీజేపీకు ఓటు వేస్తున్నామని పేరు రాకుండా బీజేపీకి మద్దత్తు ఇచ్చే ప్రణాళిక వేశారు కేసీఆర్. ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరుగునున్న విషయం తెలిసిందే.ఎన్.డి.ఎ. అభ్యర్దిని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకు రావడానికి యత్నిస్తున్నది.