Telangana-Government-Bows-Down-to-LT-Demands-1తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మరోసారి నైజాం ప్రభువుల జపం మొదలుపెట్టారు. సమైక్య పాలనలో నిజాం చరిత్రను వక్రీకరించారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను కొత్తగా రాయిస్తామన్నారు. విలీనం తర్వాత కూడా నిజాం ఆర్ధోపెడిక్‌ ఆస్పత్రికి స్థలం ఇచ్చి సొంత నిధులతో నిర్మించారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

చైనా యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రికి ఆరు టన్నుల బంగారాన్ని దేశం కోసం ఇచ్చారని పేర్కొంటూ నిజాం మంచితనం గురించి చర్చించుకుంటే తప్పేంటని వ్యాఖ్యానించారు. “ప్రకాశం బ్యారేజ్ కట్టినందుకు ఆంధ్రులకు కాటన్ దొర దేవుడు అయితే నిజాంసాగర్ కట్టిన నైజాం మనకు గొప్ప,” అని కేసిఆర్ వ్యాఖ్యానించారు.

అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి కాటన్ దొర ప్రకాశం బ్యారేజ్ కట్టారు. అయితే ప్రజలను అష్టకష్టాలు పెట్టి నన రకాల పన్నులు వేసి ప్రజలను పీల్చి పిప్పి చేసి తమ ఖజానాలు నింపుకున్నారు నైజాం ప్రభువులు. చరిత్రను తిరగరాస్తూ నైజాం కాలాన్ని స్వర్ణయుగం చేసే ప్రయత్నంలో ఉన్నారు మన ఏలిన వారు.

ఇది కేవలం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికే అని బీజేపీ ఆరోపిస్తే కాదు అని చెప్పడం ఎవరికైనా కష్టమే. ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి ఒక నియంతృత్వ రాచరికాన్ని నెత్తిన పెట్టుకోవడం బహుశా కేసీఆర్ కే చెల్లింది. అటు వంటి నైజాం రాజులను ముస్లిం సోదరులు తమవారుగా భావిస్తారనుకోవడం వాళ్ళని కించ పరచడమేనేమో?