KCR -Telangana Intermediate Board paper leakతెలంగాణా రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. వారి నిర్లక్ష్యం 20 మందికి పైగా విద్యార్థులను పొట్టనబెట్టుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండీ కేసీఆర్ ప్రభుత్వం ఎదురుకున్న అతిపెద్ద సవాలు ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రశ్నా పత్రాలను భద్రపరచడంలో కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.

వరంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు గల్లంతయ్యాయి. ఎల్లుండి నుండి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. వరంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచిన 2 ప్రశ్నాపత్రాల సీల్‌ బాక్సులు కనిపించకుండా పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. దీంతో 2 రోజులుగా ప్రశ్నాపత్రాల కోసం అధికారులు రహస్యంగా వెదుకుతున్నారు. అయితే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోర్డు మీద ఇప్పటిదాకా ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు.

ఎన్ని తప్పుల వరకూ ఉపేక్షిస్తారో కూడా తెలియదు. కేవలం ఈ విషయంగా చర్యలు తీసుకుంటే అది ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గినట్టు అవుతుందని కేసీఆర్ భావించాడమే దీనికి కారణం. సహజంగా ప్రభుత్వానికి సంబంధం లేని వివాదం దీనితో ప్రభుత్వం మీదకు వచ్చి పడింది. దీనిని అలుసుగా తీసుకుని బోర్డు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి పెడితే వారికే మంచింది.