Telangana-Corona-Crisis-KCRతెలంగాణలో కరోనా పరిస్థితి అదుపుతప్పుడు. గత రెండు మూడు రోజులుగా కేసులు తగ్గుతున్నప్పుడు ప్రభుత్వం తన బులెటిన్లలో చూపిస్తున్నప్పటికీ చాలా మంది దానిని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కరోనాని కట్టడి చెయ్యడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని భావిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఆ పార్టీ అభిమానులకు కూడా మింగుడుపడటం లేదు.

దాదాపుగా పక్షం పాటు ఫార్మ్ హౌస్ లోనే ఉండిపోయిన సీఎం కేసీఆర్ నిన్న మళ్ళీ ప్రగతి భవన్ చేరుకున్నారు. అయితే కరోనా పై రివ్యూ కూడా చెయ్యలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, దానిపై ప్రజల కోపాన్ని రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ సన్నధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. దాని కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు.

రెండు మూడు రోజులుగా తెలంగాణలో కరోనా పరిస్థితి పై అధికారులతో రివ్యూ చేస్తున్న ఆయన ఈరోజు తెలంగాణలోని అతిపెద్ద కోవిద్ ఆసుపత్రి ని సందర్శించారు. అక్కడ ఉన్న వైద్యులు… ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ చికిత్స తీసుకుంటున్న వారితో కూడా మాట్లాడారు.

కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతున్న తరుణంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏదో చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ప్రజలకు మెస్సేజ్ పంపారు. అయితే ప్రజలు బీజేపీ వైపు చూడటానికి ఇది సరిపోతుందా అనేది చూడాల్సి ఉంది. అయితే షో చెయ్యడం కాకుండా రాష్ట్రానికి నిజంగా ఏదైనా చేస్తే ప్రజలను ఆకట్టుకోవచ్చని కొందరు పెదవి విరుస్తున్నారు.