KCR Telangana CMతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మైక్ ముందుకు వస్తే దేశప్రధాని స్థాయికి ఏమాత్రం తక్కువ మాట్లాడారు. దేశరాజకీయాలను మార్చేయాలి అంటారు… తెలంగాణ భూతలస్వర్గం అని… అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అడ్డు వస్తే ప్రతిపక్షాన్నైనా, మీడియా నైనా వదలకుండా చీల్చి చెండాడతారు. అయితే ఆ జోష్ మాటల్లోనే గానీ చేత్తల్లో చూపించడం లేదని అంటున్నారు జనం.

కరోనా ని ఎదురుకోవడానికి ఎంత ఎక్కువ టెస్టులు చేస్తే అంత మంచిది అని అంతా అంటున్నా ఆ దిశగా తెలంగాణ చేస్తున్నది ఏమీ లేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు 6,12,397 టెస్టులు చేస్తే… తెలంగాణ నిన్నటి వరకూ చేసింది కేవలం 45,911. రెండు రోజుల క్రిందట ఆర్భాటంతో పది రోజులలో 50,000 టెస్టులు చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆ తరువాత సోమవారం నాడు 1,200 పై చిలుకు టెస్టులు చెయ్యగా.. మంగళవారం నాడు 1,000 పై చిలుకు టెస్టులు చేసింది. రెండో రోజు పెరగాల్సి ఉండగా టెస్టులు తగ్గాయి… ఈ లెక్కన పది రోజుల్లో యాభై వేల టెస్టులు కూడా జరిగేది కనపడటం లేదు. చెప్పేదానికి చేసేదానికి ఇంత తేడానా? అనేలా ఉంది ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరి.

నిన్న జరిపిన 1,096 టెస్టులలో 269 కేసులు పాజిటివ్ గా తేలాయి. అంటే దాదాపుగా 24.5% కేసులు పాజిటివ్ గా తేలాయి. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ మాదిరి రోజుకు పది పదిహేను వేల టెస్టులు చేస్తే రోజుకు ఎన్ని కేసులు బయటపడేవో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ మరో మహారాష్ట్రలా మారేదేమో!