What-is-KCR's-Return-Gift-to-Chandrababu-Naiduతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఏమైందో ఏమో గానీ నిన్న గాక మొన్న చంద్రబాబు హై కోర్టు విభజన చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడం నుండి అసలు హైదరాబాద్ ఐటీకి చేసింది అంటూ ఏమీ లేదని వివిధ అంశాలపై ఆయనను తూర్పారబెడుతూ వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతాడని జోస్యం కూడా చెప్పారు. అక్కడితో ఆగకుండా స్వయం ప్రకాశం లేకనే మామ నుంచి పార్టీ లాక్కున్నారు అని ఆరోపించారు.

ఇలాంటి ముఖ్యమంత్రిని బరిస్తున్న ఆంధ్రా ప్రజలకు చేతిలెత్తి మొక్కాలని అన్నారు. తాను ఎవరిని కలిస్తే చంద్రబాబుకెందుకని కేసీఆర్ అన్నారు. హోదా వస్తే అవసరమే లేదని చంద్రబాబే అన్నారని, తాము ఏపీ హోదాకు ఎప్పుడూ అడ్డు పడలేదని కేసీఆర్ అన్నారు. అవసరమైతే ఈరోజే ఉత్తరం రాస్తాం ఇవ్వమని చెప్పారు. “నీ చేతగాని తనం, నీ పాలనలోని అవినీతి వల్ల గానీ అసలు ఆంధ్రప్రదేశ్ కు లోటు బడ్జెట్ ఎక్కడ ఉంది?,” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం ఫాలో అవుతోందని ఆయన అన్నారు. తమ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని, కల్యాణలక్ష్మి, పారిశ్రామికరాయితీలను కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. ఐటీలోనూ చంద్రబాబు పీకిందేమీలేదని అన్నారు అదంతా హైదరాబాద్ కు ఉన్న సహజమైన అనుకూలతల వల్ల, స్వర్గీయ రాజీవ్ గాంధీ, ఎన్ జనార్దన్ రెడ్డి వల్ల హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి జరిగిందని, అదంతా మేమే చేశాం అని సొంత పత్రికల ద్వారా బాకా ఊదుకున్నాడని ఆరోపించారు ఆయన.

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పరానడం అంతా కల్పనేనని కేసీఆర్ విమర్శించారు. “చంద్రబాబుకి నాలుగు మాటలు ఇంగ్లీష్ మాట్లాడగలడా? రెండు మాటలు హిందీ మాట్లాడగలడా? వెళ్ళి చక్రం తిప్పుతాడంట. చక్రం లేదు మన్ను లేదు,” అని ఆయన ఎద్దేవా చేశారు. “మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వేల సంఖ్యలో ఎయిర్ పోర్టులో స్వాగతం చెప్పారు. మఠంకు వెళ్ళేదారిలో కూడా వేల మంది ఉన్నారు. వారంతా వైకాపా వారని, వెలమలని పత్రికలలో రాయించుకున్నారు. నిజానికి వాళ్ళంతా చంద్రబాబుని తెలంగాణాలో ఓడించామనే ఆనందంతో వచ్చారు. అక్కడ ఇంత కంటే దారుణంగా ఓడిస్తామనేది ఖాయం,” అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.