KCR Telangana Budget 2022తెలంగాణ ప్ర‌భుత్వం 2022-23 ఏడాదికి గాను రూ.2.56 ల‌క్ష‌ల కోట్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ పెటింది. బడ్జెట్ లో కేసీఆర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ముందుగా ఊహించినట్టుగానే కేసీఆర్ దళితులపై ప్రేమను తెగ కురిపించేశాడు. కేసీఆర్ తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు కోసం నిధులను వరద లా పారించేశాడు. ద‌ళిత బంధు ప‌థ‌కం కోసం గ‌త వార్షిక బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్ల‌ను కేటాయిస్తే.. ఈసారి ఏకంగా 17,700 కోట్లు కేటాయించాడు.

నిజానికి హుజురాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసినా.. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవలేదు. పైగా దళిత బంధు పథకం రాని వాళ్ళు ద్వేషం పెంచుకుని మరీ కేసీఆర్ కి వ్యతిరేకంగా పని చేశారు. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దళిత బంధు పథకాన్ని వదలకపోవడం ఆశ్చర్యకర విషయమే.

పైగా బడ్జెట్ లో 17,700 కోట్లరూపాయలను కేటాయించడం సంచలన నిర్ణయమే. కేసీఆర్ నిర్ణయాలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని తీసుకురాబోతున్నారు. పైగా ఇంగ్లీష్ విద్యాబోధనను అందించాలని ప్రభుత్వమే శ్రీకారం చుట్టడం, అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం చెప్పట్టాలని ప్లాన్ చేయడం.. ఈ ఏడాది బడ్జెట్ లో మరో చెప్పుకోతగ్గ అంశం.

అయితే, రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయానికి వంద కోట్లు కేటాయించడం, అలాగే కొత్తగా అటవి విశ్వ విద్యాలయం కోసం మరో వంద కోట్లను కేటాయించడం ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ లో మెయిన్ హైలైట్స్. పైగా రాబోయే రెండేళ్ల‌లో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని
కేసీఆర్‌ బడ్జెట్‌లో వెయ్యికోట్ల కేటాయించాడు.

2022-23 ఏడాదికి గాను కేసీఆర్ చేసిన బడ్జెట్ ప్లాన్ లో ఎక్కువగా పథకాలతో పాటు విద్యా వైద్య రంగాల పై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాడు. మరి ఈ బడ్జెట్ కేసీఆర్ కి ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో చూడాలి. మరోపక్క దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర‌గామిగా నిలుస్తోంద‌ని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఈ బడ్జెట్ ప్లాన్ ను బట్టి అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.