KCR Targets Chandrababu Naidu- ఓటుకు కోట్లు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోమారు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

సాక్షి పత్రిక అయితే ఉత్సాహంగా చంద్రబాబుని ఏ-1 గా చూపిస్తూ ఈ నెలాఖరుకు చార్జిషీట్ వెయ్యబోతున్నారు అంటుంది. అసలు ఉన్నఫళంగా ఈ కేసులో కదలిక ఎందుకు వచ్చిందంటే దానికి రెండు కారణాలు కనిపిస్తున్నవి. ఇటువంటి ఒక కేసుతో చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తే జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం తగ్గుతుంది.

ఇటీవలే కాలంలో జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఎక్కువగా చూబిస్తున్న కేసీఆర్ చంద్రబాబు అడ్డు తొలగించాలనుకుంటున్నారట. అదే విధముగా ఒకప్పుడు తెరాస టీడీపీ పొత్తుకు వెళ్ళబోతున్నాయి అని వార్తలు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ టీడీపీ తెలంగాణాలో కలవొచ్చు అంటున్నారు. చంద్రబాబుని ఇరికిస్తే కాంగ్రెస్ ను కట్టడి చెయ్యొచ్చని ఆయన భావన అట!

అయితే న్యాయనిపుణుల ప్రకారం చంద్రబాబుని ఈ కేసులో ఇరికించడం అంత తేలిక కాదు. ప్రాచుర్యంలో ఉన్న ఆధారాలతో చంద్రబాబుని ఏ విధంగానూ దోషిగా చూపించలేరు. అక్కడిదాకా వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అభాసుపాలు అవ్వడం ఖాయం. మనకు తెలీకుండా ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పలేం,” అని ఒక సీనియర్ న్యాయవాది అంటున్నారు.