KCR survey on TRS leadersవచ్చే ఎన్నికలకు సరైన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలలో ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మరో రెండు దఫాలు సర్వే నిర్వహించాలని తెరాస అధిష్ఠానం భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబరులో ఒకటి, డిసెంబరులో మరో సర్వే జరపనున్నట్లు తెలిసింది. దీని కోసం మార్గదర్శకాలను పార్టీ ఇప్పటికే సిద్ధం చేస్తోంది.

కారు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి మూడు నెలలకోసారి చొప్పున ఇప్పటి వరకు 13 ప్రధాన సర్వేలు నిర్వహించింది. లోక్‌సభ, శాసనసభ ఉపఎన్నికలకు సంబంధించిన విడి సర్వేలు, నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించినవి కలిసి మరో 15 వరకు సర్వేలు జరిగాయి. అధిక శాతం సర్వేల అంచనాలు నిజం కావడంతో పార్టీ అధిష్ఠానానికి వాటిపై గురి పెరిగింది.

తాజాగా జులైలో నిర్వహించిన సర్వే ఫలితాలు ఇటీవలే వచ్చాయి. త్వరలో వీటిని బహిరంగ పరుస్తారు. వచ్చే రెండు ఫలితాల బట్టే డిసెంబర్ లో వ్యతిరేక ఫలితాలు వచ్చిన సిట్టింగు ఎమ్మెల్యేలకు మొండి చేయ్యి చూపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సరిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో కేసీఆర్ టీడీపీలో ఉండగా ఆయన బాస్ ఇదే వ్యూహాన్ని ఎప్పటినుండి అమలు చేస్తూ ఉంటారు.