KCR Strategy on on increasing Assembly seatsఅసెంబ్లీ సీట్ల పెంపుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అవసరమైతే అసెంబ్లీ సీట్ల పెంపుకోసం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన భావిస్తున్నారట. అదే సమయంలో ఆయన కొత్త వాదన కూడా తెరపైకి తెచ్చారు.

పార్లమెంటు స్థానాలను కూడా మార్చవలసిన అవసరం ఉందని ఆయన వాదనను తెరపైకి తెచ్చారు.ఎప్పడో దశాబ్దాల కిందట ఉన్న లోక్ సభ నియోజకవర్గాల సంఖ్యే ఇప్పటికీ కొనసాగుతోందని, ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో,130 కోట్ల జనాబా అయ్యాక కూడా అవే సీట్లు ఉండడం వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అందువల్ల నియోజకవర్గాలలో ప్రజలకు ఎమ్.పిలుగాని, ఎమ్మెల్యేలుగాని అందుబాటులో ఉండడం కష్టం అవుతోందని ఆయన అన్నారు. ఈ కారణంగానే వాటిని కూడా పెంచే సమయం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సీట్లు పెంపుపై కేంద్రం ముందుకు వెళ్లని నేపద్యంలో తెలివిగా కెసిఆర్ అసలు దేశంలోనే లోక్ సభ సీట్లు, అన్ని రాస్ట్రాలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న వ్యూహం ముందుకు తెచ్చారు.