Narendra Modi - KCRఒకపక్క బీజేపీ, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ కావాలంటూ వివిధ రాష్ట్రాల నేతలను కలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రధాని మోడీతో మాత్రం తగాదా పెట్టుకునే ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తుంది. దీని కారణంగానే ఆయన విజయవాడలో జరుగుతున్న 11 రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సదస్సుకు హాజరు కాలేదు.

ఒక పక్క కేంద్రం రాష్ట్రాల హక్కులు హరించే ప్రయత్నం చేస్తుంది అంటూనే దానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సదస్సులకు హాజరు కాకుండా కేసీఆర్ మోడీతో తగాదా పెట్టుకునే ఉద్దేశం లేదని చెప్పకనే చెబుతున్నారు. అయితే దీని వల్ల మిగతా జాతీయ ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ ను నమ్మే అవకాశం లేదు. దీని వల్ల ఆయన జాతీయ రాజకీయ అభిలాష మీద దెబ్బ పడొచ్చు.

మరోవైపు తెలంగాణ ఈ సదస్సుకు హాజరు కాకపోతే కేసీఆర్ తాజాగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పధకానికి కావాల్సిన నగదు అందుబాటులో ఉంచడానికి కేంద్రం అంగీకరించిందని సమాచారం. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకముందే ఇటువంటి లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటే కేసీఆర్ ను ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా?