Narendra Modi - KCRకర్ణాటకలో రేపటి బలనిరూపణ నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కాకుండా హైదరాబాద్ కు తరలించారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నోవాటెల్‌ హోటల్‌కు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు.

పూర్తి రక్షణ కలిపిస్తాం అని కేసీఆర్ హామీ ఇచ్చాకే వాళ్ళు అక్కడకి వచ్చారట. కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.

అయితే ఈ పరిణామాలు నరేంద్ర మోడీ, అమిత్ షాలకు మింగుడు పడటం లేదట. నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్ర బీజేపీని నిర్వీర్యం చేసి కేసీఆర్ ను ప్రోత్సహించారు బీజేపీ పెద్దలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తగదలలో కూడా మిత్రుడు చంద్రబాబును కాదని కేసీఆర్ ను సపోర్టు చేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన ఇప్పుడు బీజేపీకి నామం పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.